Monday, 4 April 2011

ఒత్తులు పలకని మన హీరోలు

నేటి తరం హీరోలకు ఒత్తులు పలకనే పలకవు. ఉదాహరణకు అన్నమయ్య సినిమాలో అన్నమయ్య రాదా
లేదా బాధ పలక లేక రాదా అని పలికిన సందర్భాలు  ఉన్నాయి. శ్రీ నాగార్జున, వెంకటేష్, లకు ఒత్తులు పలకని విషయం అందరికి తెలిసినదే. విరిరువురని బాధ అని పలకమంటే బాద లేదా భాద లేదా భాధ అనే పలుకుతారు. మన దౌర్భాగ్యం ఏమిటంటే ఒత్తులు పలకలేని హిరోలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. విరీరువురే కాక మిగిలిన ఏక్టర్స్ కూడా అదే విధంగా ఒత్తులు పలకలేక పోతున్నారు. వీరెవరూ కూడా ఒక చిరంజీవి లేదా ఒక బాలకృష్ణ లేదా మోహన్బాబు లేదా ప్రతి నాయకుడు  కోట శ్రీనివాసరావు లేదా కేరక్టర్ ఏక్టర్ కైకాల సత్యనారాయణ లేదా రాజేంద్రప్రసాద్  లాగా కృషి చేయడం లేదు. ఈ నటులు అందరూ తమ తమ వాచకాన్ని ఎన్నో విధాల మెరుగు పరచుకొని ప్రేక్షకుల అభిమానాన్ని అందుకొన్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క నటనలో గాని, డైలాగులు చెప్పడంలో గాని శ్రీ నాగార్జున ఎందుకు కొరగారు. కారణం శ్రీ నాగేశ్వరరావుగారు డైలాగులు పలకడం లో ఆయనది ఒక విలక్షణ శైలి. ఎక్కడా ఒత్తులు తప్పుగా పలకరు. ఆయన పుత్రుడై ఉండి శ్రీ నాగార్జున తన వాచకాన్ని సరిచేసుకోక పోవడం జీర్ణించుకోవడం కష్టమే. శ్రీ నాగేశ్వరరావు గారు కూడా నాగార్జునని గొప్ప నటుడని పొగుడ్తూ ఉంటారు కాని ఆయన ఎప్పుడూ తన సుపుత్రుని మరియు తన మనుమళ్ళ యొక్క వాచకం గూర్చి ఒక్కసారి కూడా విమర్సించినట్టు కనపడదు అంతే కాదు వారి వాచకాన్ని సరిచేసే ప్రయత్నం కనపడదు. ఈ ఒత్తులు పలకలేకపోవడం పైన చెప్పిన నటులు లేదా హీరోలే కాక ఎందరో నేటి హీరోలు ఒత్తులు పలకలేరు. దానికి కారణం వారికి తెలుగు భాష మీద చిన్నచూపే కారణం కావచ్చు. హిరో కృష్ణగారి తనయుడు మహేష్ ది కూడా ఇదే పరిస్థితి. కృష్ణగారు ఒత్తులు పలకడంలో  ఎక్కడా తడబడరు. ఆయన కూడా తనదైన బాణిలో డైలాగులు చెప్తారు. శ్రీ నాగేశ్వరరావు లేదా శ్రీ కృష్ణ లేదా శ్రీ మోహన్ బాబు ఒత్తులు స్పష్టంగా పలకడంవల్లనే  అంత  పాపులర్ అయ్యారు. రామదాసు లేదా అన్నమయ్య సినిమాలలో నాగార్జున ఒత్తులు పలకలేక పోవడం ఒక అత్యంత బాధాకరమైన విషయం. ఆయన నటనలో పూర్తి మార్కులు కొట్టేసినా ఒత్తులు పలలేక పోఇనా గొప్పగా నటించినట్టుగా చెప్పడం ఎంతవరకు సమంజసం? విజ్ఞులు ఆలోచించవలసినదిగా ప్రార్థన.

No comments:

Post a Comment